Swachandham
*స్వచ్ఛందం*
-----------------
స్వచ్ఛందం...
స్వచ్ఛందం...
గృహ నిర్బంధం స్వచ్ఛందంగా పాటించాలి...
విదేశీ యాత్ర చేస్తే స్వచ్చందంగా చెప్పాలి...
స్వదేశీ కాంటాక్ట్ ఉంటే, స్వచ్ఛందంగా ముందుకు రావాలి....
క్వారంటైన్ అంటే దేశద్రోహుల జైలు శిక్ష కాదు....
ఐసొలేషన్ అంటే అదో దేశబహిష్కరణ కాదు...
ఎవరికి వారే స్వచ్ఛందంగా శుభ్రత పాటించాలి...
ఎవరికి వారే గిరి గీసుకుని సామాజిక దూరం పాటించాలి...
అత్యవసరమైతేనే అడుగు బైట పెట్టాలి...
ఇంట్లో ఉన్న దాంతో సర్దుకు పోవాలి...
చిన్న చిన్న బాధలు సహనంతో ఓర్చుకోవాలి....
మందులేని మాయరోగం కన్న...
చిన్న నొప్పి ని భరించటమే మిన్న....
చిన్న పిల్లలకు పరిస్థితి అర్ధమయ్యేలా చెప్పాలి...
భవితకు బాటను ముందుగా మనమే నిబద్ధత కలిగిన నడకతో వేయాలి...
స్వచ్ఛమైన మనసుతో ప్రజలను కరోనా నుండి కాపాడే బృహత్తర కార్యక్రమానికి నడుంకట్టి సహకరిద్దాం...
కరోనా బారిన పడిన జీవన జ్యోతులు వెలుగుతూనే ఉండాలని, చీకట్లో ఆరోగ్య దివ్వెలు వెలిగిద్దాం....
ఆ వెలుగుల కాంతికి భయపడేలా కరోనాని కటిక చీకట్లోకి తరిమేద్దాం....
Comments
Post a Comment