నైవేద్యం

నైవేద్యం
------------
కనురెప్పలు కిందికి వాలున్నా,
పంటినొక్కు కింద దాగని మొలక నవ్వులు..
చూపుల్లో చిక్కుకోక ఎటో చూస్తూనే
మనసులోని మరులు మర్మగర్భంగా తెలిపే చిరునవ్వులు...
నిండైన పలకరింపుల  హృదయపూర్వక చిరునవ్వులు...
వెక్కిరిస్తున్న నొసలు బట్టబయలు చేసే వ్యంగ్యపు నవ్వులు...
హా.. హ్హా... హ్హా... అంటూ ఆనందాన్ని పంచుకునే హార్ధిక సరదాల నవ్వులు...
ఒక్క పసిపాపల నోట తప్ప, ముసిలోళ్ళ ముడతల మొహాల్లో సైతం మాయమైన బోసినవ్వులు...
నవ్వుల చందమామకు  పట్టిన
మాస్కుల గ్రహణం వీడేదెన్నడో??
అవనిపై నవ్వుల వెన్నెల కాసేదెన్నడో??
నవ్వుల తోటలో వెన్నెల పువ్వులు పూసేదెన్నడో???
మనిషికీ మనిషికీ మధ్యన దూరం నవ్వుల పువ్వుల మాలలతో  పూడ్చే దెన్నడో
ఓ దైవమా! కాలాన్ని పరిగెత్తించైనా ఈ గ్రహణాన్ని త్వరగా తరిమేయమని ముకుళిత హస్తాలతో ప్రార్ధిస్తున్నా...
మానవాళి నవ్వుల పువ్వులతో నిను పూజించాలని ఆశిస్తూ...,రిక్తహస్తాలతో నేడు..,
నీ గుడి ముందట దూరంగా ఒంటరిగా వేచియున్నా...
మూసిన తలుపుల వెనక దేదీప్యమానంగా వెలుగుతున్న నా నమ్మకాన్ని దీపనైవేద్యంగా సమర్పిస్తూ....🙏
   
    ... డా:హిమదేవి యేకుల

Comments

Popular posts from this blog

Swachandham